
Jaiho Anthem Lyrics penned by Kasarla Shyam, music composed by Suresh Bobbili, and sung by Yazin Nizar from Telugu cinema ‘JaiHo Indians‘.
Jaiho Anthem Credits
Jaiho Anthem Lyrics in English
Aduge Saagadhu… Payanam Aagadhu
Gamyam Teliyani Naa Desamraa
Adigedhevvadu Aapedhevvadu
Sahanam Marichina Naa Deshamraa
Watch జైహొ Anthem Video Song
Jaiho Anthem Lyrics in Telugu
అడుగే సాగదు… పయనం ఆగదు
గమ్యం తెలియని నా దేశంరా
అడిగేదెవ్వడు ఆపేదెవ్వడు
సహనం మరిచిన నా దేశంరా
తెల్ల దొరల మెడలు వంచి
అర్ధరాత్రి కట్లు తెంచి
రెక్క విప్పి పావురంలా
స్వేచ్ఛగా నింగికి ఎగిరెనురా
మతం కత్తి మొనలు దూస్తే
కులం నెత్తురంత పూస్తే
మానవతను మంటలేస్తే
నా దేశం కుమిలెనురా
ఇది నా దేశంరా… జగమంతా తల్లిరా
తన పిల్లలు ఎదలో గుచ్చెను ముళ్ళులురా
ఇది నా దేశంరా… ఒక తులసి వనంరా
ఇది నేలన పెరిగెను పిచ్చిగ మొక్కలురా
ఓ ఓ, కళ్ళముందు ఒళ్ళు కాలుతూ
నిప్పుల కొలిమే నడి వీధి
ఆర్పకుండా ఆట చూస్తావేం కళ్ళారా
ఆ ఆ, రాతిగుళ్ళో నూనె నింపుతూ
వెలుగుతుంటే నిత్య దీపమే
ఆరకుండా చూస్తే పుణ్యమా సోదరా
ఆఆ, ఒక పూట తిండి లేక
ఈ డొక్కలెండుతున్నా
అభిషేకం చేస్తారే
ప్రతి పాము పుట్ట వెతికి
తన కడుపు నిండి ఉన్నా
ఇక చోటు లేదు అన్నా
పక్కోడి ముద్దనే లాగేస్తారు ఉరికి
చల్ పదరా చల్ పదరా
నీ చేబుల ఉన్న బోసి తాతనే
సీసాకై తీసి ఊగెయ్ రా
నీ దేశం నీ మోసం
అడుగడుగున రంగులు మార్చెయ్ రా
ఏదైనా ఈ దేశం తన వడినే నీకై పంచునురా
ఇది నా దేశంరా… ఒక సిరుల పంటరా
అనునిత్యం దోబిడి గురుతులనే కనరా
ఇది నా దేశంరా… ఒక శాంతి దూతరా
ప్రతి నిమిషం దాడుల ఏడుపులే వినరా